Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపోలీసుల అదుపులో మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

పోలీసుల అదుపులో మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

- Advertisement -

నవతెలంగాణ -వరంగల్: భవితశ్రీ చిట్ ఫండ్ సంస్థకు సంబంధించిన మోసపూరిత వ్యవహారాలపై, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్‌ ను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బుధవారం రాత్రి నుంచే ఆయన హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని సమాచారం. బాధితులు భవితశ్రీ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక నష్టాలు పాలయ్యారని ఆరోపిస్తూ భవితశ్రీ చిట్ ఫండ్ చైర్మన్ అయిన గుండా ప్రకాష్ పై పిర్యా దు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఆయనను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్లు, పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం గుండా ప్రకాష్ ను గురువారం ఎంజీఎం హాస్పిటల్ కు తీసుక వచ్చి వైద్య పరీక్షలు చేసిన అనంతరం న్యాయ స్థానం ఎదుట నిలబెడతారని విశ్వాస నీయ సమాచారం. గుండా ప్రకాష్ రావు అరెస్ట్ వ్యవహారం చిట్ ఫండ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -