Thursday, September 25, 2025
E-PAPER
HomeఆటలుASIA CUP: భార‌త్ ఫైన‌ల్ ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు..?

ASIA CUP: భార‌త్ ఫైన‌ల్ ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు..?

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్: హోరాహోరిగా సాగుతున్న ఆసియా కప్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4లో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండాగానే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రేపు శ్రీలంకతో టీమిండియా నామమాత్రపు మ్యాచ్ అడాల్సి ఉంది. అలాగే ఈ రోజు జరిగే బంగ్లా – పాక్ మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఎవరో తెలిపోతుంది.

బంగ్లాదేశ్ బ‌ల‌మేంత‌..?
పాక్‌తో పోలిస్తే బంగ్లా జట్టు బలంగానే ఉందానే చెప్పాలి. రానున్న కాలంలో ఆసియాలో నెంబర్ 2 టీంగా ఎదిగిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేదు. పాక్‌ సారథి సల్మాన్ అఘాతో పోలిస్తే బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ కాస్త ఫర్వాలేదు. ఎప్పుడైనా పరుగులు రాబట్టగలడు. భారత్‌తో గత మ్యాచ్‌కు లిటన్ దాస్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తప్పకుండా పాక్‌తో మ్యాచ్‌లో ఆ విరామం కలిసి వస్తుందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. దుబాయ్‌ వంటి పిచ్‌పై స్లో బంతులతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెడుతున్నాడు. దీంతో పాక్‌ బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడం పెద్ద‌ సవాలే. రిషాద్ హుసేన్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం బంగ్లాకు కలిసొచ్చే అంశమే. బ్యాటింగ్‌లో లిటన్‌ దాస్‌, సైఫ్‌ హసన్‌, తౌహిద్ హృదోయ్‌పైనే బంగ్లా ఎక్కువ ఆధారపడుతోంది. సూపర్ -4లో ఇప్పటికే శ్రీలంకను మట్టికరిపించిన బంగ్లా మరో అద్భుత విజయంతో ఫైనల్‌కు చేరుకోవాలని చూస్తోంది.

పాకిస్థాన్ మెరుగుప‌డేనా..?
పాకిస్థాన్ పేసర్లు షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్‌ పెద్దగాఆశించిన స్థాయిలో రాణించ‌డంలేదు. రవూఫ్‌ మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీయగా షహీన్‌ షా మాత్రం ఐదు మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. యువ స్పిన్నర్ సయామ్ ఆయుబ్ కూడా ఆరు వికెట్లు తీశాడు. ఇంకా బ్యాటింగ్ విషయనికి వస్తే ఫర్హాన్‌, ఫకర్ జమాన్‌ ఆడితేనే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగల‌రు. సైయామ్, సల్మాన్ అఘా నుంచి భారీ ఇన్నింగ్స్‌లను ఆ జ‌ట్టు ఆశిస్తుంది. శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో త‌క్కువ స్కోరును ఛేదించే క్ర‌మంలో టాప్ ఆర్డ‌ర్ తో పాటు మిడిలార్డ‌ర్ కూప్ప‌కూలిపోయింది. మిడిలార్డ‌ర్‌లో పాక్ జ‌ట్టు మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈరోజు బంగ్లాతో మ్యాచ్ గెలిచి..భార‌త్‌తో మ‌రోసారి ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డాల‌ని ఆ దేశ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కాసేప‌ట్లో ప్రారంభ‌కానున్న బంగ్లా-పాక్ మ్యాచ్‌తో భార‌త్ ఫైన‌ల్ ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో తెలిపోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -