నవతెలంగాణ–హైదరాబాద్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి ఐదేండ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు పారిస్‌లోని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుంచి అక్రమ నిధులకు సంబంధించిన కేసులో ఆయనను దోషి నిర్థారించింది. దీనిపై సర్కోజీ అప్పీలు చేసుకున్నా.. జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే, జైలుకు వెళ్లే తేదీపై నిర్ణయాన్ని మాత్రం తర్వాత వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది.
అవినీతి, ప్రచారానికి అక్రమ నిధులు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వంటి ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో మాత్రం సర్కోజీని న్యాయస్థానం దోషిగా నిర్ధరించి ఐదేళ్ల శిక్ష విధించింది. తీర్పు సమయంలో మాజీ అధ్యక్షుడు సహా ఆయన కుటుంబ సభ్యులు కోర్టు రూమ్‌లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో విచారణ జరగ్గా.. ఆయనపై వచ్చిన అభియోగాలను సర్కోజీ ఖండించారు. ఇదిలాఉంటే, అవినీతికి సంబంధించిన మరో కేసులో కూడా సర్కోజీకి గతంలో జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.