- Advertisement -
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె-ర్యాంప్’. హీరోగా ఆయన నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ – శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. త్వరలో సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
- Advertisement -