- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎస్సార్‌నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని ఏసీ విభాగం నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దిగారు. అనంతరం మంటలు బస్సును వ్యాపించాయి. క్రమంగా మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.
- Advertisement -