-పండుగ పూట పస్తులేనా…,!
– ఆవేదన వ్యక్తం చేస్తున్న డీలర్లు
నవతెలంగాణ-అచ్చంపేట
రేషన్ షాపుల ద్వారా పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లకు గత ఆరు నెలలుగా ప్రభుత్వం కమిషన్ డబ్బులు ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట పస్తులు ఉండవలసిందేనని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 558 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 లక్షల 34000 రేషన్ కార్డుదారులు ఉన్నాయి. ప్రతినిధుల బియ్యం పంపిణీ చేసినందుకు డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కిలో కు 95 పైసలు, కేంద్ర ప్రభుత్వం 45 పైసలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం 6 నెలలకు సంబంధించిన కమిషన్ డబ్బులు ఇవ్వడం లేదు. జిల్లా రేషన్ డీలర్లకు కోటిన్నరపైగా బకాయిలు రావాల్సి ఉంది. రేషన్ షాపుల అద్దె, బియ్యం దిగుబడి, గుమస్తా ఖర్చులు భారంగా మారాయని రేషన్ డీలర్లు వాపోతున్నారు.
రేషన్ డీలర్లకు కమిషన్ అందక అవస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES