Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంమాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను టూవీల‌ర్‌తో ఢీకొట్టాడు..వీడియో

మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను టూవీల‌ర్‌తో ఢీకొట్టాడు..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ వ్య‌క్తి త‌న మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను యాక్టివా టూవీల‌ర్‌తో ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న ఇండోర్‌లోని క‌ల్ప‌నా న‌గ‌ర్‌లో జ‌రిగింది. రిలేష‌న్ కొన‌సాగించాల‌ని వ‌త్తిడి చేసిన అత‌ను.. గ‌ర్ల్‌ఫ్రెండ్ నిరాక‌రించ‌డంతో ఆమెపై టూవీల‌ర్‌తో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన సీసీటీవీ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రిత‌మే నిందితుడితో ఆ మ‌హిళ రిలేష‌న్ తెంచుకున్న‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ అత‌ను ఆమెను వెంటాడుతూ వ‌త్తిడి చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఆ అమ్మాయి నిరాక‌రించ‌డంతో.. నిందితుడి ప్ర‌వ‌ర్త‌న మ‌రింత దూకుడుగా మారింది.

https://twitter.com/i/status/1971458008585732593

అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆ మ‌హిళ‌ను అత‌ను వెంబ‌డించాడు. తొలుత అత‌ని మీద‌కు రాయి విసిరి త‌న‌ను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ కోపంతో ఉన్న నిందితుడు.. కావాల‌నే ఆ మ‌హిళ‌పైకి స్కూట‌ర్‌ను ఎక్కించాడు. గాయ‌ప‌డ్డ బాధితురాలు హీరాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఇప్ప‌టికే ఏడు క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అత‌ని కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -