- చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ ఆధ్వర్యంలో బహుకరణ
నవతెలంగాణ-హైదరాబాద్: ధీరవనిత ఐలమ్మ 130వ జయంతి సందర్బంగా పంచ లోహ ఐలమ్మ ప్రతిమను వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సూర్య ధనంజయకి..చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా నాగిళ్ల శంకర్ మాట్లాడుతూ… భూమికోసం, భుక్తికోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వానికి వ్యతిరేకంగా భూస్వామ్య, పెత్తందారులపై పోరాడిన వీరవనిత.. చాకలి ఐలమ్మ పేరును కోటి ఉమెన్స్ కాలేజీకి పెట్టడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సర్కార్ నిర్ణయంతో ఐలమ్మ పోరాటం భావితరాలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కవి రచయిత సుద్దాల అశోక్ తేజ,చాకలి ఐలమ్మ సంఘం కోఆర్డినేటర్లు కోలుకులపల్లి రాధిక, పగిళ్ల సందీప్, మామిండ్ల రమేష్ రాజా,ఐతరాజు లక్ష్మణ్, నాగిళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.