Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐలమ్మకు నివాళులర్పించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ 

ఐలమ్మకు నివాళులర్పించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ 

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ  ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయి అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనం అని, వీరనారి చిట్యాల ఐలమ్మ  ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. శుక్రవారం పట్టణంలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ యోధురాలికి ఘన నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో  మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్ ,మాజి మునిసిపల్ చైర్మన్ పండిత్ పవన్  పిఎసిఎస్ చైర్మన్ కాపెళ్లి చిన్న ముత్తెన్న డిసిసిబి డైరెక్టర్ వాసు,ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ ,కౌన్సిలర్ హన్మాండ్లు పట్టణ యూత్ అధ్యక్షులు విజయ్ ,నాయకులు జిమ్మి రవి ,జితేందర్ , సాయినాథ్,ఫాయీమ్ భాయ్,కొట్టాల మోహన్ ,నారాయణ,చిక్కు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -