Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజంట జ‌లాశ‌యాలకు పోటెత్తిన వ‌ర‌ద‌..గేట్లు ఓపెన్

జంట జ‌లాశ‌యాలకు పోటెత్తిన వ‌ర‌ద‌..గేట్లు ఓపెన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండ‌పోత వాన కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. ఈ క్ర‌మంలో హిమాయ‌త్ సాగ‌ర్ 4 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. హిమాయ‌త్ సాగ‌ర్ ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,100 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగ‌ర్ 10 గేట్లు ఎత్తేశారు. ఇన్‌ఫ్లో 4,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7,096 క్యూసెక్కులుగా ఉంది. దీంతో మూసీ న‌దికి వ‌ర‌ద ఉధృతి పెరిగింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు. నార్సింగి, హిమాయ‌త్‌సాగ‌ర్ వ‌ద్ద స‌ర్వీస్ రోడ్డును మూసివేశారు. మంచిరేవుల – నార్సింగ్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -