Friday, September 26, 2025
E-PAPER
Homeజిల్లాలుసౌత్ క్యాంపస్ విద్యార్థి గ్రూప్-1 కు ఎంపిక..

సౌత్ క్యాంపస్ విద్యార్థి గ్రూప్-1 కు ఎంపిక..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న  తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న కరీంనగర్  జిల్లాకు చెందిన శ్రీజా రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన  గ్రూప్- 1  ఫలితాలలో రాష్ట్రస్థాయిలో  509 ర్యాంకు సాధించి  మల్టీ జోన్ వన్ లో ఎంపీడీవోగా ఎంపికైనట్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సహకారంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం, మరియు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -