నవతెలంగాణ – మల్హర్ రావు: వెట్టి చాకిరి,తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారురాలు చాకలి ఐలమ్మ130వ జయంతిని శుక్రవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో జాతీయ బీసీ సంఘo జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య నాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అణగారిన వర్గాల కోసం పోరాటం చెందిన విరవనిత ఐలమ్మ విగ్రహం కొయ్యుర్ ఏర్పాటు చేయాలని కోరారు.ఐలమ్మ ఆశయాలని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు.మాజీ సర్పంచ్ లు సిద్ధి లింగమూర్తి,రమేష్ మార్కెట్ డైరెక్టర్ గడ్డం పోశయ్య,తాజోద్దీన్,భూమయ్య,శ్రీనివాస్ రెడ్డి,గుంటి రమేష్.సతీష్ లక్ష్మణ్,బాపు.మల్లయ్య,బాపు పాల్గొన్నారు.
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES