- Advertisement -
అప్పన్న హస్తం కోసం ఎదురుచూపు
బాధితున్ని ఆదుకోవాలని గ్రామ ప్రజల వేడుకలు
నవతెలంగాణ – కాటారం
నేడు కురిసిన భారీ వర్షం కారణంగా నేరెళ్ల పోచమల్లు దేవరాంపల్లి నివసిస్తున్న పెంకుటిల్లు ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన, తీవ్రమైన పరిస్థితి, పెంకుటిల్లు, దాని పైకప్పు పెంకులు దానికి సపోర్టుగా ఉన్న దూలాలు, వాసాలు కూడా పూర్తిగా కూలిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి,మళ్లీ తిరిగి నిర్మించడానికి కూడా వీలు లేకుండా పెంకులు, చెక్కలు విరిగిపోయాయి. ఈ పరిస్థితినీ అర్థం చేసుకొని నేరెళ్ల పోచమల్లుకు గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు, మండల అధికారీ, జరిగిన నష్టం గురించి తెలుసుకొని సహాయం చేయాలని కోరుతున్నారు
- Advertisement -