Saturday, September 27, 2025
E-PAPER
Homeక్రైమ్ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కందుకూరు వ‌ద్ద డీసీఎం మిల్ల‌ర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను యాచారం మండ‌లం కురుమిద్ద‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల‌ను స‌త్తెమ్మ‌(50), శ్రీనివాస్‌935), శ్రీధ‌ర్‌(25) గా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -