Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచాద‌ర్‌ఘాట్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌..

చాద‌ర్‌ఘాట్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మూసీకి వ‌ర‌ద పోటెత్త‌డంతో.. చాద‌ర్‌ఘాట్ వ‌ద్ద బ్రిడ్జిపై నుంచి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో అక్క‌డున్న చిన్న వంతెన‌ను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్క‌టే తెరిచి ఉంచారు. దీంతో కోఠి, నాంప‌ల్లి వైపు వెళ్లే వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాద‌ర్‌ఘాట్ నుంచి మ‌ల‌క్‌పేట్ వ‌ర‌కు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

చాద‌ర్‌ఘాట్ చిన్న వంతెన‌పై 6 అడుగుల మేర వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. మూసారంబాగ్ వంతెన‌పై 10 అడుగుల మేర న‌ది ఉప్పొంగి ఉర‌క‌లేస్తుంది. ఇక అంబ‌ర్‌పేట్ – మూసారంబాగ్ మ‌ధ్య నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిని తాకుతూ వ‌ర‌ద కొన‌సాగుతోంది. ఈ వ‌ర‌ద నీటిలో నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది. మూసారంబాగ్ వైపు ఉన్న పెట్రోల్ పంపు కూడా నీట మునిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -