Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని జాతీయ రహదారిపై మహీంద్రా థార్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి గురుగ్రామ్‌కు వస్తున్న ఆరుగురు వ్యక్తులకు (ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు) శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -