నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జమ్మూకాశ్మీర్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. జవాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు సీఎం విరాళం
దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించే క్రమంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత సాయుధ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారతీయునిగా తన ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో, పార్టీలో తన సహచరులు, పౌరులు విరాళాలిచ్చేందుకు కదలాలని కోరారు. ఈ సమయంలో భారత సైన్యంతో మనమంతా ఒక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు.
నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ప్రజా ప్రతినిధుల విరాళం
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని రాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా భట్టి విజ్ఞప్తి చేశారు.
జవాన్ మురళీ నాయక్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES