Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుBoduppal: పార్క్ స్థలం కబ్జాపై కాలనీ వాసుల ఆగ్రహం

Boduppal: పార్క్ స్థలం కబ్జాపై కాలనీ వాసుల ఆగ్రహం

- Advertisement -




• ప్రహరీని కూల్చివేసిన మహిళలు కాలనీ వాసులు

నవతెలంగాణబోడుప్పల్: తమ కాలనికి చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే పార్క్ స్థలాన్ని కొందరు కబ్జా దారులు అప్పనంగా సోమ్ముచేసుకున్నారని కాలనీ వాసులు ఎన్బి సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కాలనీ వాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక తమ కాలనీ స్థలాన్ని తామే రక్షించుకుంటామని తెల్చుకున్న కాలనీ వాసులు కబ్జా దారులు తమ పార్క్ స్థలానికి వేసిన ప్రహరిని తొలగించారు.

వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి సాయి ప్రియా కాలనీలోని సర్వే నెంబరు 6 లో ఉన్న 2000 గజాల స్థలాన్ని లే అవుట్ చేసిన సమయంలో పార్క్ స్థలంగా చూపించారు. కానీ కాల క్రమంలో కొందరు కబ్జా దారులు సదరు పార్క్ స్థలానికి బై నెంబర్ల సహాయంతో పది ప్లాట్లు చేసి క్రయవిక్రయాలు జరిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పార్క్ స్థలమని కాలనీ వాసులు ఫిర్యాదు చేయగా నిర్మాణం అనుమతులను కార్పొరేషన్ అధికారులు రద్దు చేశారు. అప్పటి నుండి అ వివాదం న్యాయ స్థానంలో ఉంది. గత మూడు రోజుల క్రితం కబ్జా చేశారంటున్న పార్క్ స్థలంలో కొందరు వ్యక్తులు ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టడంతో కాలనీ వాసులు మరోసారి కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా కనీసం పట్టించుకోకపోవడంతో శనివారం ఉదయం కాలనీ వాసులు పిల్లపాపలతో సహా సదరు ప్రహరీ గోడలను తొలగించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మేం కాలనీలో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో ఈ స్థలాన్ని పార్క్ స్థలంగా చూపించి ప్లాట్లు అమ్మారు ఇప్పుడు ఇది పార్క్ స్థలం కాదంటూ ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్తులో మా పిల్లలు ఎక్కడ ఆటలు అడుకోవాలి.కాలనీ అసోసియేషన్ కార్యక్రమాలు ఎక్కడ జరుపుకోవాలి న్యాయం కోసం ఎండ్ల తరబడి నాయకుల చుట్టూ, కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. అందుకే మా పార్క్ స్థలాన్ని మేమే కాపాడుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -