Saturday, May 10, 2025
Homeజాతీయంకార్పొరేట్‌ అనుకూల, మనువాద సిద్ధాంతాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోత్సాహం

కార్పొరేట్‌ అనుకూల, మనువాద సిద్ధాంతాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోత్సాహం

- Advertisement -

– వాటికి వ్యతిరేకంగా సైద్ధాంతిక ప్రజా ఉద్యమాలు జరగాలి: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు యూ.వాసుకి
నవతెలంగాణ బ్యూరో – యర్నాకులం

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్పొరేట్‌ అనుకూల, మనువాద సిద్ధంతాలను ప్రోత్సహిస్తున్నాయని ఐద్వా ఉపాధ్యక్షురాలు, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు యూ.వాసుకి విమర్శించారు. ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కూడా ఐడియాలజికల్‌ స్థాయిలో జరగాలని ఆమె సూచించారు. పోరాడుతున్న వారే గెలుస్తారని ఆమె తెలిపారు. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా ఎంఎస్‌ఎం అకాడమీ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న అఖిల భారత మహిళా వ్యవసాయ, గ్రామీణ కార్మికుల మహాసభ శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో రాజస్థాన్‌ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కార్యవర్గ సభ్యురాలు దుర్గా స్వామి జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరుల స్మారక స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అఖిల భారత అధ్యక్షులు ఎ.విజయ రాఘవన్‌, కార్యదర్శి బి.వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. మహాసభను యూ.వాసుకి ప్రారంభించి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా ఈ దాడిని ఖండిస్తున్న తరుణంలో కొందరు శక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఐక్యత అత్యంత కీలకమనీ, సామాజిక ఐక్యతే సమాజాన్ని రక్షించగలదని సూచించారు.
మహిళా వ్యవసాయ కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని యూ.వాసుకి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయే భయం, ఆర్థిక అసమానతలు, జెండర్‌ వేతన వ్యత్యాసం, గృహాల్లో వేతనం లేకుండా చేసే పనికి గుర్తింపు లేకపోవడం, ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపుల్లో లోపాలు వంటివి వారిని కుంగదీస్తు న్నాయని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ లోపాలు, గర్భధారణ, ప్రసవ సమయం లో సరైన పింఛను లేకపోవడం, తగిన వైద్య సేవలు అందని పరిస్థితులతో వారు సతమతమవుతున్నాయని తెలిపారు. శారీరకంగా వ్యవసాయ పనిలో పురుషు లతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ, కార్మికురా లిగా, తక్కువ జాతి వ్యక్తిగా, మహిళగా సామాజి కంగా మూడు స్థాయిల్లో స్త్రీలు అణచివేతను ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి చట్టాల ద్వారా వామపక్షాలు పోరాడి సాధించిన సమాన వేతన హక్కును ఆమె ప్రస్తావిస్తూ, అలాంటి చట్టాలను ప్రజా ఉద్యమాల ద్వారానే సాధించవచ్చునన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మహాసభ నడిపించేందుకు ప్రెసిడియం సభ్యులుగా కోమల కుమారి, బోన్యా టుడ్డు, బి.పద్మ, ఎస్‌.పూన్గోతై, సరితా శర్మా, దుర్గా స్వామి, జిషా శ్యామ్‌ ఎన్నికయ్యారు. అంతర్గత కార్యకలా పాల్లో భాగంగా ఎస్‌.పూన్గోతై పలువురికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సీతారాం యేచూరి, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొడియేరి బాలకృష్ణన్‌, మల్లు స్వరాజ్యం తదితర ప్రముఖులను స్మరించున్నారు. అలాగే గృహ, లైంగిక, కుల, మత హింస బాధి తులు, పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వారు, పాలస్తీనా పోరాటంలో ప్రాణాలు కోల్పోయి నవారు, ఉక్రెయిన్‌ యుద్ధంలో మరణించినవారికి సభ నివాళులర్పించింది. ఈ మహాసభలో దేశవ్యాప్తంగా 400 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. చర్చించబోయే డ్రాఫ్ట్‌ తీర్మానం ఆధారంగా, వారి ప్రాంతీయ అనుభవాలు పరస్పరం పంచుకుని, మహిళా వ్యవసాయ కార్మికుల సమస్యలను లోతుగా విశ్లేషించి, భవిష్యత్‌ ఉద్యమానికి స్పష్టమైన కార్యచరణ రూపొందించాలన్నదే మహాసభ ప్రధాన లక్ష్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -