- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు జరిగాయని మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తి శుక్రవారం తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ ప్రభాకర్ రెడ్డి, వివిధ పాఠశాలల నుంచి నియామకం కాబడిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -