– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
– కమ్మర్ పల్లిలో ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పద్మశాలి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తా వద్ద మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి, స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మండల పద్మశాలి బాంధవుల సమక్షంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తపించారన్నారు.పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్న త్యాగధనుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తోలితరం ఉద్యమకారులు, రాజీలేని తెలంగాణ పోరాట యోధుడు, మూడు తరాల ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు చింత తిరుపతి, ప్రధాన కార్యదర్శి నల్ల భూమేశ్వర్, కోశాధికారి పోతు ధరణి కుమార్, కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చింత హనుమంతు, ఓం మొదటి పద్మశాలి సంఘం అధ్యక్షులు జిందం రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నాయకులు, పద్మశాలి సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES