Saturday, September 27, 2025
E-PAPER
Homeనిజామాబాద్పోటీల్లో క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

పోటీల్లో క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

- Advertisement -

– టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్  
– ఉప్లూర్ లో ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఆటల పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో యూత్ కాంగ్రెస్ మండల కమిటీ నిర్వహిస్తున్న నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ జిల్లాల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడల ద్వారా శారీరిక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను పక్కనపెట్టి క్రీడస్ఫూర్తిని ప్రదర్శించడమే ముఖ్యమన్నారు. యువతలో క్రీడలను ప్రోత్సహించేందుకు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ జిల్లాల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మండల యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకొని క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, డిసిసి డెలిగేట్ తక్కురి దేవేందర్, నాయకులు బద్దం రాజేశ్వర్ రెడ్డి, బోనగిరి లక్ష్మణ్,  అవారీ సత్యం, తక్కురి శేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మెండే నరేందర్, సయ్యద్ సదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -