– తేల్చి చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు
న్యూయార్క్: భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఆ విషయంలో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని అమెరికా తేల్చి చెప్పింది. ప్రాధమికంగా అది తమ పని కాదని వ్యాఖ్యానించింది. గురువారం ఒక టివి ఇంటర్వ్యూలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్‌లను అమెరికా నియంత్రించ లేదని అన్నారు. అయితే ఆ రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకునేలా తాము ప్రోత్సహించగలమని అన్నారు. ”అణ్వాయుధ దేశాలు ఎప్పుడైనా ఢ కొంటే, ప్రధాన ఘర్షణగా మారితే మేం ఆందోళన చెందుతాం.” అని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని అమెరికా కోరుకుంటోందని, ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో చేసిన ప్రకటనలను వాన్స్ ఉదహరించారు. ఆయుధాలు విడనాడాలని అటు భారతీయులను ఇటు పాకిస్తానీయులను అమెరికా కోరలేదని చెప్పారు. అందువల్ల దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ ప్రయత్నం చేయాలని మేం భావిస్తున్నామని అన్నారు.
భారత్, పాక్ విషయంలో జోక్యం చేసుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES