Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంబీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ను ప్రారంభించిన ప్రధాని

బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ను ప్రారంభించిన ప్రధాని

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వదేశీ 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ‘భారత్ టెలికాం స్టాక్’ నెట్‌వర్క్‌ను జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా టెలికాం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా దేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, సుమారు రూ.37,000 కోట్ల వ్యయంతో, సౌరశక్తితో పనిచేసే 97,500 మొబైల్ 4జీ టవర్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి గ్రామానికి 4జీ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘100 శాతం 4జీ సాచురేషన్ ప్రాజెక్టు’కు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశాలోని 2,472 గ్రామాలతో సహా దేశవ్యాప్తంగా సరిహద్దు, మారుమూల, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 26,700కు పైగా గ్రామాలకు తొలిసారిగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సుమారు 2.2 కోట్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -