నవతెలంగాణ ఆర్మూర్
మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి .ప్రభాకర్ అన్నారు.. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ పిలుపుమేరకు డివిజన్ కార్యదర్శి బి. దేవారం అధ్యక్షతన సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు దేశంలో కులం ఆనవాళ్లు మనం రాకెట్ యుగంలోకి వెళ్లిన ఇంకా కొనసాగడం సిగ్గుచేటు అన్నారు. ఉన్నత కులాలుగా చెప్పుకుంటున్న వారు తమ పేర్ల వెనకాల తోకలు తగిలించుకుంటే కుల పీడుతులు సహితం కులం తోకల్ని తగిలించుకోవడం కులం పోకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వాలు సహితం ఓట్ల కోసం కుల రాజకీయాలకు పూనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ కుల ఉచ్చులో పేదలు, శ్రమజీవులు పడకూడదు అన్నారు. బాపనోడు తమ పబ్బం గడపడానికి కులం ను బలోపేతం చేయడానికి మనువాదం ను ఎత్తుకున్నారు అన్నారు. బిజెపి సహితం అగ్రవర్ణాల పక్షం నిలబడి మనువాదం ను అమలు చేయడానికి పూనుకుంటున్నారు అన్నారు. ఈ బిజెపి కుల ఉన్మాదంకు వ్యతిరేకంగా పోరాడవల్సినఅవసరం ఎంతైనా అవసరం అన్నారు. కులరక్కసిని తరిమి వేయడానికి యువత కంకణ బద్ధులు కావాలి అని ఆయన పిలుపును ఇచ్చారు.
ఇ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం. ముత్తేన్న, ఎస్. సురేష్, ఆర్. రమేష్, కె. రాజేశ్వర్, జి. కిషన్, వి. సత్తేవ్వ, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు బి. కిషన్, ఆర్. దామోదర్, బి. బాబన్న, ఏ. అశోక్, యు. రాజన్న, ఆకుల. గంగారాం, మండల నాయకులు జి. అరవింద్, టీ. గంగాధర్, పి ఓ డబ్ల్యు నాయకులు జి. పద్మ, ఎం.సునీత, వి. బాలయ్య, ఇ. రమేష్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి యస్.దుర్గ, ఏరియా అధ్యక్షులు డి. నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.