
నవతెలంగాణ కంఠేశ్వర్ : ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత వైఎస్ఆర్ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నల్లమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనతోపాటు పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందించాలని పరితపించిన నాయకుడు వైయస్సార్ ని ఉచిత కరెంటు,రాజీవ్ ఆరోగ్యశ్రీ జలయజ్ఞం,ఇందిరమ్మ ఇల్లు,అభయహస్తం, పావలా వడ్డీ,ఫీజు రియంబర్స్మెంట్, రైతుల పంట రుణాల మాఫీ, భూ పంపిణీ, 108,104 సేవలు, పశుక్రాంతి,రేషన్ కార్డులు పంపిణీ లాంటి సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైయస్సార్ గారని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి వైయస్సార్ గారు ఎనలేని కృషి చేశారని ఉమ్మడి జిల్లాలో వైయస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి ఆయన ఆయన దివంగతులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే తప్ప గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లా అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో భాగంగా గుత్ప , అలీ సాగర్, హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించారని, పురాతనమైన నిజాంసాగర్ కాలువ ఆధునీకరణ కోసం 500 కోట్లు వెచ్చించారని,జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం అందించే విధంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు మెడికల్ కళాశాల ను ఏర్పాటు చేశారని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.జలయజ్ఞం ప్రాజెక్టులు కట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసి వ్యవసాయాన్ని పండగ చేశారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి వారికి సొంత ఇంటి కలను సాకారం చేశారని, మైనారిటీ రిజర్వేషన్ కల్పించి మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశారని, బడుగు బలహీన వర్గాలు పిల్లల తో పాటు అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలా చేశారని, 108,104 అంబులెన్స్ లను ఏర్పాటు చేశారని, రైతులకు రుణమాఫీ చేశారని, రైతులకు ఉచిత విద్యుత్ అందించారని రాష్ట్రంలో ప్రతి పేదవానికి తెల్ల రేషన్ కార్డు ద్వారా 103 రూపాయలకే అన్ని రకాల నిత్యావసర సరుకులు అందజేసి ఆహార భద్రత కల్పించారని,వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చేయూతనిచ్చేందుకు 2004లోనే 200 రూపాయలు పెన్షన్ అందించారని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులు,కార్మికులు,విద్యార్థులు యువత,మహిళలు,వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి సంక్షేమ ఫలాలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందజేస్తామని అలాగే రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిగా చూడాలన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల కోరికను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అభిమానులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్ బీన్ హందాన్ గారు మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నాకు ప్రత్యేకమైన అభినవభవ సంబంధం ఉందని 1985 తనకు ఎమ్మెల్యే టికెట్ రావడంలో వైయస్సార్ గారి పాత్ర మరువలేనని,నాలాంటి ఎంతోమంది నాయకులు ఆయన ప్రోత్సాహంతో ఆయన నాయకత్వంలోనే నాయకులుగా ఎదిగామని, మైనారిటీ సోదరులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి వారిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా ఉన్నత చదువులు చదివించి వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేశారని విషయాన్ని గుర్తు చేసుకోవాలని, వైయస్సార్ గారు మొదటిసారి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడే ఆర్మూర్ నియోజకవర్గంలో ఐదెకరాలలో ఈత వనాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రానున్న కాలంలో పనిచేసి రాష్ట్రంలో మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతా రెడ్డి రాజారెడ్డి ,మీసాల సుధాకర్ రావు ,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడ్డి భాగ్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, పిసిసి మెంబర్ ఈసా,నిజామాబాద్ రూరల్ మాజీ మండల అద్యక్షులు రమేష్,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి సుజాత,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,సాయిలు,కిషన్, ఎన్ ఎస్ యు ఐ నిఖిల్,నరేంద్ర సింగ్,మూష్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
