Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘ఫ్యూచర్‌సిటీ’ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

‘ఫ్యూచర్‌సిటీ’ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ ఫ్యూచర్‌సిటీ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్‌సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్‌సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నారు.

765 చదరపు కి.మీ.విస్తీర్ణం, 56 రెవెన్యూ గ్రామాలు, మూడు శాసనసభ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్‌పై జనాభా ఒత్తిడిని తగ్గించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తోంది. ప్రపంచబ్యాంకు, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా)లు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -