Sunday, September 28, 2025
E-PAPER
Homeఆటలుఐపీఎల్‌కు అర్హత సాధించాలంటే..బీసీసీఐ కొత్త రూల్‌

ఐపీఎల్‌కు అర్హత సాధించాలంటే..బీసీసీఐ కొత్త రూల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ టోర్నీలో యువ ఆటగాళ్లు ఆడాలనుకుంటే.. తప్పనిసరిగా ఒక ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడి ఉండాలనే రూల్‌ ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం అండర్‌-16, అండర్‌ -19 ప్లేయర్లు ఐపీఎల్‌కు అర్హత సాధించాలంటే.. రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ అయిన ఆడిన అనుభవం తప్పనిసరి.

ఆదివారం జరిగిన బోర్డు సర్వసభ్య సమవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఇక మీదట యువ ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్‌లోకి రావడానికి వీల్లేదు. వారు తమ రాష్ట్రం తరఫున కనీసం ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లోనైనా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దేశీయ క్రికెట్‌ను బలోపేతం చేసే దిశగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -