- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో దాయాదులు తొలిసారి ఎదురుపడుతున్న ఫైనల్ ఇది. దాంతో.. విజయం ఎవరిని వరిస్తుంది? అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
బిగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి బౌలింగ్ తీసుకున్నాడు. ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా కోలుకోకపోవడంతో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. పాక్ మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని సల్మాన్ అఘా వెల్లడించాడు.
- Advertisement -