Saturday, May 10, 2025
Homeఆటలుత్వరలోనే మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తాం : గంగూలీ

త్వరలోనే మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తాం : గంగూలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్ – పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 సీజన్‌ను బీసీసీఐ వారం రోజులపాటు వాయిదా వేసింది. దాయాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో క్రికెట్ ఆడటం సమంజసం కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, త్వరలోనే మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తామని.. పాకిస్థాన్‌ మరింతకాలం ఒత్తిడి తట్టుకోవడం కష్టమని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం ఉంది. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌ను వాయిదా వేసింది. ఎందుకంటే భారత్‌కు చెందిన క్రికెటర్లే కాకుండా విదేశీ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. వారి భద్రత విషయంలో రాజీ పడకూడదు. అయితే, త్వరలోనే ఐపీఎల్‌ 2025 సీజన్ పునఃప్రారంభమవుతుంది. ఇప్పుడు టోర్నీ కీలక దశలో ఉంది. ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, జైపుర్‌.. ఇలాంటి మైదానాల్లో కొన్ని మ్యాచులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ నిర్ణయం సరైందే. గత మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో చూశాం. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. బీసీసీఐ తప్పకుండా ఐపీఎల్‌ను పూర్తిచేసింది. ఎందుకంటే ఒత్తిడిని మరింత కాలం తట్టుకొనేంత సీన్‌ పాక్‌కు లేదు అని గంగూలీ తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -