Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం సభకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

సీఎం సభకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్, గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని సీఐ సత్యనారాయణ తెలిపారు. కందుకూరు మండలం బేగరి కంచె గ్రామానికి చెందిన ఢిల్లీ రామచంద్రయ్య మిర్ఖాన్ పేట వద్ద ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని చూసి తిరిగి రాత్రి 7 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తుండగా, అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -