Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆసియా కప్‌ విజేత..టీమ్‌ ఇండియాకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ

ఆసియా కప్‌ విజేత..టీమ్‌ ఇండియాకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీమిండియా ఏకంగా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడింది. తిలక్‌ వర్మ 53 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుతంగా పోరాడడంతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్‌దీప్‌ 4, అక్షర్‌ పటేల్‌ 2, వరుణ్‌ చక్రవర్తి 2 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్‌ మొదట పాక్2ను 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఓపెనర్లు ఫర్హాన్‌ 38 బంతుల్లో 57, ఫకార్‌ జమాన్‌ 35 బంతుల్లో 46 రాణించారు. తిలక్‌తో పాటు శివమ్‌ దూబె 22 బంతుల్లో 33 పరుగులతో రాణించడంతో భారత్‌ టార్గెట్‌ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఆసియా కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియాకు రూ.21 కోట్ల ప్రైజ్‌ మనీని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా భాగస్వాములు కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -