నవతెలంగాణ-హైదరాబాద్ : ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాలు.. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని గీతానగర్ కాలనీకి చెందిన గున్నాల దివ్యశ్రీ(32) ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు ఆడపడుచులు. ఆస్తుల పంపకానికి సంబంధించి వారిద్దరు తరచూ వేధిస్తుండటంతో దివ్యశ్రీ మానసికంగా ఆందోళన చెందారు. శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదాశివపేటలోని పరిశ్రమలో పనిచేస్తున్న భర్త మల్లికార్జున్ విధుల అనంతరం ఇంటికి వచ్చారు. ఇంట్లో విగతజీవిగా వేలాడుతున్న భార్యను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేధింపులు తట్టుకోలేక ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES