నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ హాట్ టాఫిక్‌గా నడుస్తోంది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. పోలింగ్‌లో భాగంగా ఆయా గ్రామాల ఓటర్ జాబితా,బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి, పోలింగ్ కేంద్రాలను సంసిద్ధం చేసింది. అదే విధంగా రాష్ట్రవ్యాపంగా ముందుగా ఎంపీపీ, ఎంపీటీసీ పోలింగ్‌ను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆయా ప్రాంతాలకు చెందిన జెడ్పీటీసీ,ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. ఈ రిజర్వేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వింత జరిగింది.
జిల్లాలోని చింతకాని మండలానికి చెందిన రాఘవాపురం గ్రామ సర్పంచ్ పదవి, 2 వార్డు స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఆ గ్రామంలో ఒకే ఎస్సీ కుటుంబం (తల్లి కోటమ్మ, కుమారుడు దావీదు) ఉంది. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంపల్లి కోటమ్మ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. అలాగే 4వ వార్డు ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఆమె కుమారుడు దావీదు వార్డు మెంబర్‌గా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.