నవతెలంగాణ-హైదారాబాద్: భారత్‌కు చెందిన సుదర్శన చక్రంగా పేరుగాంచిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను భారతీయ సైన్యం ఖండించింది. ఆదంపూర్‌లో ఉన్న ఎస్-400 రక్షణ వ్యవస్థను పాకిస్థాన్‌కు చెందిన జేఎఫ్-17 ఫైటర్ విమానలకు చెందిన హైపర్‌సోకిన్ మిస్సైల్లు ధ్వంసం చేసినట్లు వార్తలను వ్యాపిస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ మిలిటరీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఎస్-400 రక్షణ వ్యవస్థ ధ్వంసమైనట్లు పాకిస్థాన్‌కు చెందిన పీటీవీలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఆ వార్తలను ఖండిస్తూ భారతీయ సైన్యం ప్రకటన చేసింది. చైనాకు చెందిన జినాహూ వార్తా ఏజెన్సీ కూడా ఎస్400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు వార్తలను ప్రచురించింది. అయితే ఆ వార్తలు అన్నీ అబద్దాలు అని భారతీయ సైన్యం పేర్కొన్నది
ఎస్-400 మిస్సైల్ సిస్టమ్‌పై పాక్ దుష్ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES