Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంవిస్కీ అమ్మకాలలో కర్ణాటక అగ్రస్థానం

విస్కీ అమ్మకాలలో కర్ణాటక అగ్రస్థానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: దక్షిణ భారతదేశంలో విస్కీకి భారీగా డిమాండ్ పెరిగింది. సీఐఏబీసీ(కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌) గణాంకాల మేరకు 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(ఎ్‌ఫవై-25)లో దేశంలోని ఐఎంఎ్‌ఫఎల్‌(ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) అమ్మకాల్లో 58 శాతం దక్షిణభారతంలోనే జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 23.18 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. ఎఫ్‌వై-24లో దేశవ్యాప్తంగా 39.62 కోట్ల ఐఎంఎ్‌ఫఎల్‌ కేసులు అమ్ముడుపోగా, ఎఫ్‌వై-25లో 40.17 కోట్ల కేసులు అమ్ముడయ్యాయని సీఐఏబీసీ డైరెక్టర్‌ జనరల్‌ అనంత్‌ ఎస్‌ అయ్యార్‌ చెప్పారు.

దేశంలోని మొత్తం అమ్మకాలలో 17 శాతం సాధించి కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఎఫ్‌వై-25లో తెలంగాణలో 3.71 కోట్ల కేసులు, ఏపీ 3.55 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్త అమ్మకాలలో ఇది సుమారు 9 శాతం. దేశంలోని మొత్తం అమ్మకాలలో ఉత్తర భారతం 20 శాతం సాధించింది. అందులో అత్యధికంగా 2.50 కోట్ల కేసులు ఉత్తరప్రదేశ్‌లో అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా 6వ స్థానంలో యూపీ నిలిచింది. దాని తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌(9), ఢిల్లీ(10), హరియాణా(11) నిలిచాయి. రాజస్థాన్‌లో 1.37 కోట్ల కేసులు, ఢిల్లీలో 1.18 కోట్ల కేసులు, హరియాణాలో 1.17 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. ఉత్తర భారతం కూడా ఎఫ్‌వై-25లో ఐఎంఎ్‌ఫఎల్‌ అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -