నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సైన్యం దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా ఆర్మీని ఢీకొనలేక..పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లోని పౌరుల నివాసాలపై దాడులకు తెగబడుతోంది. సామాన్య జనాల ఆవాసాలు, పలు ఆధ్యాత్మిక మందిరాలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. జమ్మూకశ్మీర్ బార్డర్ ప్రాంతలైన కుప్వారా, ఉరి, పూంచ్ తదితర ప్రదేశాల్లో జనవాసాలపై పాక్ దాడులు చేస్తోంది. ఉరిలో పలు ఇండ్లు ధ్వంసమైయ్యాయి. అదే విధంగా పూంచ్‌లోని పాక్ క్షిపణులు దాడులకు ఇండ్లతో పాటు వాటర్ ట్యాంక్ దెబ్బతిన్నంది. పాక్ ఆర్మీ కావాలనే ఆధ్యాత్మిక కేంద్రాలు మసీదులు, గురుద్వారు, గుడులపై బాంబులు వేస్తోందని స్థానికులు వాపోతున్నారు. పాక్ కవ్వింపులకు బెదిరేది లేదని, భారత్ దళాలకు తాము కూడా వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నారు. మరోవైపు దాయాది దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. SDRF సాయంతో లోకల్ పోలీసులు జవాన్లుకు అండగా నిలుస్తున్నారు.
పౌరుల నివాసాలే లక్ష్యంగా సరిహద్దులో పాక్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES