నవతెలంగాణ – హైదరాబాద్: గతంలో కంటే ఎక్కువగా ఆవిష్కరణ, చురుకుదనాన్ని పరిశ్రమలు కోరుతున్నందున, ప్రముఖ టెలికాం ఆపరేటర్ వి యొక్క వ్యాపార విభాగం అయిన వి బిజినెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి -డాట్) లతో కలిసి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) ఆధారిత ఆవిష్కరణలు, వ్యాపారాల కోసం సహ-సృష్టి కోసం ఒక కేంద్రంను ఏర్పాటు చేస్తూ వి బిజినెస్ ఐఓటి ఇన్నోవేషన్ ల్యాబ్ (ది ల్యాబ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక కీలకమైన మలుపు వద్ద ఉంది, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఐఓటి , 5జి వంటివి వ్యాపార సంస్థల వృద్ధి యొక్క తదుపరి దశను నడిపిస్తాయి. కనెక్ట్ చేయబడిన వాహనాలు, స్మార్ట్ తయారీ, ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్‌లో భవిష్యత్తు-సిద్ధంగా ఉన్న ఐఓటి పరిష్కారాల అభివృద్ధి, పరీక్షలను నడిపించే భాగస్వామ్య కేంద్రం ఈ ల్యాబ్. స్టార్టప్‌లు, పరికర తయారీదారులు , ఎంటర్‌ప్రైజ్‌లు బిఎఫ్ఎస్ఐ , ఐటి /ఐటిఈఎస్, యుటిలిటీస్, లాజిస్టిక్స్, తయారీ, రిటైల్, పాలన, ఆరోగ్య సంరక్షణ మరియు స్మార్ట్ సిటీలలో పరిశ్రమ-గ్రేడ్ ఐఓటి వినియోగ కేసులను రూపొందించడానికి, పరీక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి ఈ ల్యాబ్ సహాయపడుతుంది.
ముంబైలో ఏర్పాటు చేయబడిన ఈ ల్యాబ్, కనెక్ట్ చేయబడిన వాహనాల ప్రదర్శనలు, మెరుగైన రీతిలో విద్యుత్ వినియోగం కోసం స్మార్ట్ గ్రిడ్, రియల్-టైమ్ మానిటరింగ్ కోసం స్మార్ట్ తయారీ మరియు ఎడ్జ్ ఏఐ తో ఐఓటి యొక్క భవిష్యత్తును అందిస్తుంది. వి బిజినెస్ యొక్క బలమైన కనెక్టివిటీ, ఏడబ్ల్యుఎస్ యొక్క గ్లోబల్ క్లౌడ్ సామర్థ్యాలు మరియు సి -డాట్ యొక్క ప్రామాణిక నైపుణ్యాన్ని కలపడం ద్వారా, ఇది వినియోగదారులు మార్కెట్‌కు చేరే సమయాన్ని వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాటియా మాట్లాడుతూ, “ఏడబ్ల్యుఎస్ మరియు సి -డాట్ భాగస్వామ్యంతో వి బిజినెస్ ఐఓటి ఇన్నోవేషన్ ల్యాబ్‌తో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌లు మరియు వ్యాపార సంస్థల కోసం సరైన పర్యావరణ వ్యవస్థను మేము రూపొందిస్తున్నాము. సమిష్టిగా, మేము భారతదేశ ఐఓటి వాతావరణంను మార్చాలని, ఆవిష్కరణకు కొత్త అవకాశాలతో సంస్థలను శక్తివంతం చేయాలని మరియు భారతదేశం యొక్క డిజిటల్ వృద్ధికి దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఏఐ, 5జి మరియు ఐఓటి లను ఎక్కువగా సంస్థలు స్వీకరించడంతో వాటికి కనెక్టివిటీ కంటే ఎక్కువ అవసరం – కొలవగల వ్యాపార ఫలితాలను అందించడానికి వారికి విశ్వసనీయ భాగస్వామి అవసరం. వ్యాపారాలు సురక్షితంగా వ్యాప్తి చెందటానికి, వేగంగా ఆవిష్కరణలు చేయడానికి మరియు విశ్వాసంతో రూపాంతరం చెందడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.
“భారతదేశంలోని సంస్థలు తమ కార్యకలాపాలను మార్చడానికి మరియు మెరుగైన కస్టమర్ అనుభవాలను అందించడానికి క్లౌడ్, ఏఐ మరియు ఐఓటిలను వేగంగా స్వీకరిస్తున్నాయి” అని ఏడబ్ల్యుఎస్ ఇండియా మరియు దక్షిణాసియా బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ వి.జి. సుందర్ రామ్ అన్నారు. “ఈ భాగస్వామ్యం ద్వారా, వ్యాపార సంస్థలు , స్టార్టప్‌లు తదుపరి తరం ఐఓటి ఆధారిత పరిష్కారాలను మార్కెట్‌కు తీసుకురావడానికి సహాయపడటానికి మేము ఏడబ్ల్యుఎస్ యొక్క క్లౌడ్ మరియు ఏఐ సామర్థ్యాలను వి యొక్క కనెక్టివిటీతో కలుపుతున్నాము” అని అన్నారు.
సి-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ “జాతీయ ప్రమాణంగా స్వీకరించబడిన ఐఓటి పర్యావరణ వ్యవస్థలో గ్లోబల్ వన్ఎం2ఎం ప్రమాణాలను స్వీకరించటం ద్వారా భారతదేశం యొక్క డిజిటల్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సి-డాట్ కృషి చేస్తోంది. వి బిజినెస్ భాగస్వామ్యంతో, పరిశ్రమ ఈ ప్రమాణాలను సజావుగా స్వీకరించడంలో సహాయపడటానికి మేము ఐఓటి ఇన్నోవేషన్ ల్యాబ్‌లో పరీక్షా వాతావరణాలను సృష్టించాము. ఇది విభిన్న వ్యవస్థలలో పరస్పర సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది, అదే సమయంలో అత్యధిక స్థాయి డేటా భద్రత, గోప్యత, రియల్-టైమ్ అధీకృత డేటా మార్పిడి, సమకాలీకరణను సమర్థిస్తుంది. భారతదేశ ఐఓటి ల్యాండ్‌స్కేప్‌ను విశ్వసనీయంగా, వ్యాప్తి చేయతగినదిగా మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుతుంది” అని అన్నారు.
భారతీయ ఐఓటి పరిశ్రమ వేగవంతమైన వృద్ధి పథంలో ఉంది. 2024 నాటికి జాతీయ ఐఓటి పరికర మార్కెట్ $2.89 బిలియన్లుగా అంచనా వేయబడింది, ఇది 2030 నాటికి $10.28 బిలియన్లకు చేరుకుంటుందని, 23.2% సిఏజిఆర్ నమోదు చేస్తుందని అంచనా. ఇంత వేగంగా విస్తరించడంతో, వ్యాప్తిచేయతగిన, ప్రమాణాల ఆధారిత పరిష్కారాల అవసరం వుంది . ఈ వేగమును ఉపయోగించుకోవడానికి వ్యాపారసంస్థలు మరియు స్టార్టప్‌లకు వి బిజినెస్ పునాది వేస్తోంది. 2025 నాటికి భారతదేశంలో 1.59 లక్షలకు పైగా డిపిఐఐటి -గుర్తింపు పొందిన స్టార్టప్‌లతో, వాటిలో చాలా వరకు ఐఓటి , ఏఐ మరియు డిజిటల్ అప్లికేషన్లలో నిర్మిస్తుండటంతో , ఈ ల్యాబ్ కొత్త యుగ పరిష్కారాల కోసం లాంచ్‌ప్యాడ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.