నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై ఆంక్షలను పునరుద్ధరించినట్లు యూరోపియన్ యూనియన్ (ఇయు) సోమవారం ధృవీకరించింది. అయితే దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచి ఉన్నాయని ఇయు ఒక ప్రకటనలో తెలిపింది. ఆంక్షలలో భాగంగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ మరియు ఇతర ఇరాన్ బ్యాంకుల ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ఇరాన్ అధికారులపై ప్రయాణ నిషేధాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇరాన్ ముడి చమురు కొనుగోలు, రవాణా, బంగారం, కొన్ని నౌకాదళ పరికరాల విక్రయం లేదా సరఫరాను కూడా నిషేధించింది. అణు ఒప్పందానికి ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ గూఢచారిని ఉరితీసిన ఇరాన్
ఇజ్రాయిల్ గూఢచారిని ఇరాన్ సోమవారం ఉరితీసింది. ఇజ్రాయిల్‌కు అత్యంత ముఖ్యమైన గూఢచారుల్లో బహ్మాన్ చౌబీ అస్ల్ అనే వ్యక్తి ఒకరని ఇరాన్ న్యాయవ్యవస్థ వార్తా సంస్థ మిజాన్ తెలిపింది. సుప్రీంకోర్టు ప్రతివాది అప్పీల్‌ను తిరస్కరించిందని, అవినీతికి పాల్పడినందుకు ఉరిశిక్ష విధించిందని పేర్కొంది. నిందితుడు ఇజ్రాయిల్‌కి చెందిన మొసాద్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని వెల్లడించింది. ఇజ్రాయిల్ ఈ ఏడాది జూన్ నుండి ఇరాన్‌పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై దాడులకు దిగింది.