నవతెలంగాణ-హైదరాబాద్: భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు పాకిస్తాన్ డ్రోన్‌ను గుర్తించి కూల్చివేశాయి. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే చండీగఢ్‌లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌లో ఉదయం 5 గంటలకు భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడగా.. భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపారు. శ్రీనగర్ విమానాశ్రయం, ఎయిర్ బేస్ పైనా డ్రోన్లతో దాడికి పాక్ డ్రోన్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.
అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్ల కూల్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES