Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు.!

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు సోమవారం అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తంగేడు పూలు,గునుగు పూలు,బంతిపూలు,చామంతులతో బతుకమ్మలు అందంగా పేర్చి మహిళలందరు ఒక చోట కూడి చప్పట్లతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక విశిష్టతకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగని తెలిపారు.బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ కాదని–ఇది ఆడబిడ్డల ఆశయాల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, భూదేవికి సమర్పించే నైవేద్యమని,ఇది తల్లి, చెల్లి, అమ్మాయిల ప్రతి మడిలో మెదలే గౌరవానికి నిలువెత్తు గుర్తన్నారు.సంప్రదాయం ఆధునికతల మేళవింపుగా, సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకమయ్యేలా, సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.9 రోజులు అమ్మవారిని కొలుసుకుంటామన్నారు.”బతుకు చైతన్యం–బతుకమ్మ ఆరాధనం”అన్నట్లుగా, ఇది తెలంగాణ ఆడబిడ్డల గొంతులో ఊసెత్తే ఉయ్యాల పాట అన్నారు.బతుకమ్మ వెనక సైంటిఫిక్ రీసన్ ఉంది. ఎన్నో ఔషధ గుణాలున్న బతుకమ్మ పూలతో చెరువులు శుద్ధి అవుతాయి. తంగేడు, గునుగు, కట్ల పూలు యాంటీ బయోటిక్. పంటలిచ్చిన చెరువులను మొక్కుకోవడం బతుకమ్మ ఆచారం. తాగునీళ్లు కూడా గతంలో చెరువులు ఇచ్చేవి. చెరువులకు కృతజ్ఞతా భావం తెలపడమే బతుకమ్మ ముఖ్య ఉద్దేశంన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -