Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : హాలియా పట్టణం, శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని మంగళవారం దర్శించుకొని నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడు తూ దుర్గామాత ఆశీస్సులు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని  కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మాజీ కోఆప్షన్ నెంబర్ చాపల సైదులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ సురభి రాంబాబు, 12వ వార్డు ఇంచార్జ్ మాతంగి కాషాయ్య,చవ్వాకుల రాజు,గడ్డం సోము, రావుల పాటి యల్లయ్య, బాలు,శ్రవణ్,వంశీ,అఖిల్,శిగలం బట్ల నాగరాజు,ప్రభాకర్, సైదులు, నవీన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -