Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాల‌తో త‌న అనుభ‌వం అద్భుత‌మైంది: మాజీ DGP జితేంద్ర

తెలుగు రాష్ట్రాల‌తో త‌న అనుభ‌వం అద్భుత‌మైంది: మాజీ DGP జితేంద్ర

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్‌ల‌తో తన అనుభవం అద్భుతమైనదని మాజీ DGP జితేంద్ర అన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ సీనియర్ అధికారులు, మాజీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా DGP జితేంద్ర మాట్లాడుతూ.. పంజాబ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కి కేటాయింపుపై, ఇక్కడి సీనియర్ అధికారుల మద్దతు, మార్గదర్శకత్వం త‌న‌కు గొప్ప స్ఫూర్తినిచ్చింద‌న్నారు.

ఇప్పుడు తెలంగాణను త‌మ‌ ఇల్లుగా భావిస్తున్నామ‌ని జితేంద్ర పేర్కొన్నారు. తమ పదవీకాలంలో సాధించిన విజయాలను చెబుతూ.. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయి.. నేరాలు అదుపులో ఉన్నాయి. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, అంతర్రాష్ట్ర ముఠాలు, బెట్టింగ్ రాకెట్లు ఇలా అన్ని కంట్రోల్ చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -