- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు మొదలవుతాయి. జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయవ్య భారతం నుంచి సెప్టెంబరు 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబరు 15 నాటికి ముగుస్తుంది. ప్రస్తుతం ఇవి జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది.
- Advertisement -