- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ వ్యక్తిని ఐరన్ రాడ్‌తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాచివాని సింగరానికి చెందిన కిన్నెర జంగయ్య వ్యక్తి యాక్టివ బైక్ పై వెళ్ళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. ఆ తర్వాత ఐరన్ రాడ్‌తో దాడి చేసి అదే కారులో పరరాయ్యడు. తీవ్ర గాయలతో ఉన్న జంగయ్యను స్థానికులు పీర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. కిన్నెరా జంగయ్య ఉమ్మడి ఘట్ కేసర్ మండలం కాచివాని సింగరానికి చెందిన వార్డు మెంబర్ భర్త. ఇక సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -