Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐని ఆదరించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐని ఆదరించండి

- Advertisement -

కాంగ్రెస్ మిత్రధర్మం పాటించి సీపీఐ పోటీ చేసే స్థానాల్లో బలపరచాలి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ కార్యవర్గ సమావేశం వై.రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం మోగించిన ఎన్నికల నగారాలో భాగంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే వారినే ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నుకోవాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు సజావుగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీకి రావాల్సిన గ్రాంటును విడుదల చేయించుకుంటేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మిత్రధర్మం పాటించి సిపిఐ పోటీ చేసే స్థానాల్లో బలపరచాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.ఓమయ్య, ఏ.రాజేశ్వర్, జిల్లా నాయకులు ఎం.స్వరూప రాణి, బి రఘురాం పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -