Tuesday, September 30, 2025
E-PAPER
Homeబీజినెస్తిరుపతిలో నూతన అల్ట్రావయోలెట్ ప్రారంభం

తిరుపతిలో నూతన అల్ట్రావయోలెట్ ప్రారంభం

- Advertisement -
  • – ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి – విశాఖపట్నంలో అమ్మకానికి X-47, F77 సూపర్‌స్ట్రీట్ మరియు F77 MACH 2 అందుబాటులో ఉన్నాయి.
  • – తిరుపతిలో యువి  స్పేస్ స్టేషన్ ప్రారంభంతో అల్ట్రావయోలెట్ తమ జాతీయ కార్యకలాపాలను విస్తృతం చేసింది, దేశవ్యాప్తంగా 26 నగరాల్లో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుంది.
  • – కస్టమర్ యాక్సెస్: కస్టమర్ లైఫ్ సైకిల్ యొక్క సమగ్ర అవసరాలను తీర్చడం ద్వారా ఔత్సాహికులకు లీనమయ్యే బ్రాండ్ అనుభవాన్ని అందిస్తుంది.
  • – వ్యక్తిగతీకరించిన టెస్ట్ రైడ్‌లు మరియు సేవలు: అనుభవ కేంద్రంలో  ప్రత్యేకమైన  టెస్ట్ రైడ్ అవకాశాలు, అంకితమైన సేవా సహాయం మరియు అసలైన విడిభాగాల లభ్యత ఉన్నాయి.
  • నవతెలంగాణ – తిరుపతి: తమ అంతర్జాతీయ కార్యకలాపాలను ఇటీవల యూరప్ లో పారంభించటంను అనుసరించి, ఈరోజు తిరుపతిలో తమ అత్యాధునిక అనుభవ కేంద్రం ప్రారంభంతో  భారతదేశంలో తమ విస్తరణను మరింతగా అల్ట్రావయోలెట్ పెంచుతోంది. ఈ కేంద్రం ప్రారంభం,  భారతదేశంలో అల్ట్రావయోలెట్ యొక్క కొనసాగుతున్న వృద్ధిని వెల్లడిస్తోంది.  దేశవ్యాప్తంగా పనితీరు-ఆధారిత, పర్యావరణ అనుకూల విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించడంలో దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

డీలర్ ఎస్ఎన్ ఆటోతో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన యువి స్పేస్ స్టేషన్, వినియోగదారులకు అల్ట్రావయోలెట్ యొక్క  మోటర్ సైకిళ్ళు – X-47, F77 MACH 2 మరియు F77 సూపర్ స్ట్రీట్ లను ప్రత్యక్షంగా వీక్షించటానికి, సమగ్ర అనుభవాన్ని పొందటానికి సహాయపడుతుంది. యువి స్పేస్ స్టేషన్ ఒక 3ఎస్ సౌకర్యం. టెస్ట్ రైడ్ అనుభవం, అమ్మకాలు, సేవ ,  వివిధ రకాల మోటర్ సైకిల్ ఉపకరణాలతో సహా అన్నీ ఒకే చోట అందిస్తూ లీనమయ్యే అనుభవాలను అందించడానికి ఇది రూపొందించబడింది.

అల్ట్రావయోలెట్ యొక్క తాజా ఆవిష్కరణ , X-47 క్రాస్ఓవర్ ప్రపంచంలోనే మొట్టమొదటి కెమెరా,  రాడార్ అనుసంధానిత  మోటర్ సైకిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను కూడా పరిచయం చేస్తుంది, ఈ ఎయిర్ కూల్డ్ ఛార్జర్‌ను  పూర్తిగా అల్ట్రావయోలెట్, అభివృద్ధి చేయడంతో పాటుగా రూపొందించి,  ఇంజినీరింగ్ చేసింది.  టైప్ 6 తో DC ఫాస్ట్ ఛార్జింగ్ మరియు టైప్ 2 తో AC కార్ ఛార్జింగ్ రెండింటినీ X-47 సపోర్ట్ చేస్తుంది. దాదాపు  323 కి.మీ ఐడిసి రేంజ్, 10.3kWh బ్యాటరీ ప్యాక్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, 10వ తరం బోష్  స్విచ్చబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ , పరిశ్రమ యొక్క మొట్టమొదటి రేడియల్ ఆల్-టెర్రైన్ టైర్లు మరియు టైప్-సి  మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌ను X-47  కలిగి ఉంది.  X-47 క్రాస్ఓవర్ బుకింగ్‌లను అల్ట్రావయోలెట్

వెబ్‌సైట్- www.ultraviolette.comలో చేసుకోవచ్చు. డెలివరీలు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి.

F77లు 40.2 hp మరియు 100 Nm టార్క్‌ను కలిగి ఉన్న పవర్‌ట్రెయిన్‌తో విద్యుత్ పనితీరును పునర్నిర్వచించాయి, ఇది కేవలం 2.8 సెకన్లలోనే 0 నుండి 60 kph వరకు వేగం అందుకుంటుంది. 10.3 kWh బ్యాటరీని కలిగిన ఇది ఒకే ఛార్జ్‌పై 323 కి.మీ ఐడిసి రేంజ్‌ను కలిగి ఉంది.

“ప్రపంచంలోని మొట్టమొదటి కెమెరా, రాడార్-ఇంటిగ్రేటెడ్ మల్టీ-టెర్రైన్ క్రాస్ఓవర్ మోటర్‌సైకిల్ అయిన X-47 ను తిరుపతిలో పరిచయం చేయటం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. వీటిని  మా పనితీరు చిహ్నాలైన F77 MACH 2 మరియు F77 సూపర్‌స్ట్రీట్‌లతో పాటు ప్రదర్శిస్తున్నాము” అని అల్ట్రావయోలెట్ సిఈఓ  మరియు సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం అన్నారు.

ఈ ప్రారంభంతో, అల్ట్రావయోలెట్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది,  దక్షిణ భారతదేశంలో మా  విస్తరణలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. భారతదేశ స్మార్ట్ సిటీస్ మిషన్‌లో తిరుపతిని చేర్చడం పర్యావరణ అనుకూల  పట్టణ చలనశీలతకు ఒక ముందుకు ఆలోచించే విధానాన్ని సూచిస్తుంది. ఇక్కడ మా కొత్త అల్ట్రావయోలెట్ కేంద్రం కేవలం రిటైల్ అనుభవం మాత్రమే కాదు, ఇది క్లీన్ , కనెక్ట్ చేయబడిన చలనశీలత కోసం ప్రభుత్వ విస్తృత దృక్పథంతో ప్రతిధ్వనిస్తుంది. మేము మా జాతీయ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న వేళ, తిరుపతి వంటి నగరాలు ధైర్యంగా, ప్రతిష్టాత్మకంగా మరియు విద్యుత్తుతో కూడిన అట్టడుగు స్థాయి నుండి ఈవీ  విప్లవాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని అన్నారు. 

అల్ట్రావయోలెట్ సరిహద్దులను అధికమిస్తూనే ఉంది, కాలంతో పాటుగా  దాని ఉత్పత్తులను నిరంతరం మెరుగుపరుస్తుంది. దాని తాజా ఆవిష్కరణ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిణామం- ‘జెన్ 3 పవర్‌ట్రెయిన్ ఫర్మ్‌వేర్’ మరియు ‘బాలిస్టిక్+’ పనితీరు మెరుగుదలలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది, ఇది అన్ని F77 మునుపటి మరియు కొత్త కస్టమర్‌లకు అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంది. F77లు ఇప్పుడు చాలా వేగవంతమైన ప్రతిస్పందన, వేగవంతమైన త్వరణం అందిస్తున్నాయి. 2024లో, F77లలో పరిణామం యొక్క మొదటి దశ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (UVDSC), 10 స్థాయిల రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, వైలెట్ A.I. మరియు మరిన్ని భద్రతా ఫీచర్ల పై దృష్టి సారించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, అల్ట్రావయోలెట్ దాని కొత్తగా ప్రారంభించబడిన రెండు ప్రధాన స్రవంతి ఆఫర్‌లు –  ప్రపంచంలోనే అత్యాధునిక విద్యుత్ స్కూటర్  – ‘టెస్సెరాక్ట్’, ఇది ఈ విభాగంలో మొట్టమొదటి  ఇంటిగ్రేటెడ్ రాడార్ , డాష్‌క్యామ్‌ను కలిగి ఉంది, ఇది ఓమ్నిసెన్స్ మిర్రర్‌లతో సజావుగా జత చేయబడింది. దానితో పాటు, ఒక విప్లవాత్మక  ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ – ‘షాక్‌వేవ్’, ఉల్లాసకరమైన రైడింగ్ అనుభవాన్ని కోరుకునే రైడర్‌ల డిమాండ్‌లను తీర్చడానికి జాగ్రత్తగా రూపొందించబడింది మరియు ఇంజనీరింగ్ చేయబడింది-  కు కూడా అద్భుతమైన ప్రతిస్పందనను చూసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -