Sunday, May 11, 2025
Homeతాజా వార్తలుబాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూత

బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ విక్రమ్‌ గైక్వాడ్‌ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ -ముంబయి : జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ బాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ విక్రమ్‌ గైక్వాడ్‌ (51) శనివారం కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు ముంబయిలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. హిందీ, మరాఠీ, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలో విక్రమ్‌ పనిచేశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్‌ గైక్వాడ్‌ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్‌ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ”తెరపై పాత్రలకు ప్రాణం పోసిన మాంత్రికుడు” అని అభివర్ణించారు. విక్రమ్‌ గైక్వాడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన వాటిలో.. బెల్‌ బాటమ్‌, ఉరి : ది సర్జికల్‌ స్ట్రైక్‌, బ్లాక్‌ మెయిల్‌, దంగల్‌, పీకే, సూపర్‌ 30, కేదార్‌నాథ్‌, థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌, ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ తదితర హిందీ సినిమాలున్నాయి. మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్‌ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -