నవతెలంగాణ-హైదరాబాద్: నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్‌ప్యాడ్‌ల పేల్చివేతకు చెందిన వీడియోను భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది. ఆ లాంచ్‌ప్యాడ్ల వద్ద ఉగ్రవాదులకు చెందిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కొనసాగినట్లు ఆర్మీ పేర్కొన్నది. భారతీయ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ఆ కేంద్రాలను లాంచ్‌ప్యాడ్‌లుగా వాడుకుంటున్నట్లు ఆర్మీ చెప్పింది. వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్య వల్ల.. ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, సామర్థ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. మే 8, 9వ తేదీల్లో జరిగిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా టెర్రర్ లాంచ్‌ప్యాడ్లపై దాడులు చేసినట్లు ఆర్మీ ప్రకటించింది.
ఉగ్రవాదల లాంచ్‌ప్యాడ్ పేల్చివేత.. వీడియో విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES