- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో, చిరంజీవి నటించిన తొలి కౌబాయ్ సినిమా ‘కొదమ సింహం’ 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రానుంది. 1990, ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రాన్ని 4కె కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో నవంబర్ 21న రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలిపారు. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
- Advertisement -